21, జులై 2012, శనివారం

యూనీకోడ్ లోకి మారుదాం


యూనీకోడ్ లోకి మారుదాం

 ఇప్పుడు తెలుగు భాషకూ తెలుగు ప్రజలకూ వున్నన్ని యాతనలు ఇన్నీ అన్నీ కావు. భాషను కాపాడవలసిన వాళ్ళు, పెంపుదలకు ప్రోదిచేయవలసిన వాళ్ళూ అందుకు మారుగా దాని వెనకబాటుకు తోడుపడుతున్నారు అని కొంతమంది భాషా ప్రేమికులు బాధపడుతున్నారు.దుస్థితికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి.మిగతా విషయాలు ఎలా ఉన్నా ఇంటర్ నెట్ లోనూ ,పుస్తక ప్రచురణలోను నాకు కనబడిన కొన్ని కారణాలూ వాటి పరిష్కార మార్గాలూ చెబుతా ను:
1.ప్రసిద్ధ ఫాంట్లు
తెలుగు భాషలో మంచి ఫాంట్లు అభివృద్ధి చేశారు.సాంకేతిక పరికరాలు వచ్చాయి. కొన్ని భాషా వ్యాపారసంస్థలు తమ వెబ్‌సైట్లలోని వ్యాసాలని సేవ్‌చేసుకునేందుకు దారి ఇవ్వటం లేదు. కాపీ చేసుకోవటాన్ని అరికట్టడానికి డైనమిక్‌ఫాంటుని ఎంచుకుంటున్నారు. నాగార్జున వెన్న, uni.medhas.org లాంటి వారు వారి ఫాంటుకి పద్మ ఎక్ట్సెన్షన్‌లో సపోర్ట్‌ కలిగిస్తే ఫైర్‌ఫాక్స్‌ లో యూనికోడులో కనిపించేవి. వాటిని అప్పుడు యూనికోడులో సేవ్‌ చేసుకోగలిగేవారు. ఈ సంగతి గమనించిన వ్యాపారస్తులు ఆ ఫాంటుని తొలగించి, పనికట్టుకుని వేరే ఎన్‌కోడింగ్‌కల వేరే ఫాంటుని ఉపయోగించటం మొదలుపెట్టారు. ఈ ఫాంట్లను జాతీయం చెయ్యండి అనే విన్నపాలను కూడా తిరస్కరిస్తున్నారు.ఇంత చక్కటి ఫాంట్లకు రూప కల్పన చేసి వాటిపై  పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నది  ప్రజలకు ఉచితంగా ఇవ్వటానికా?అంటూ వెళ్ళి అడిగినవారిపైన విరుచుకు పడుతున్నారు. వాళ్ళంతా వ్యాపారస్తులు కాబట్టి ఆ అక్షరాలే వాళ్ళ మూలధనం కాబట్టి వారి వాదనలో న్యాయం ఉంది.అందమైన అక్షరాలు రకరకాల సైజుల్లో రూపొందించారు.డీటీపీ వాళ్ళంతా ఇన్నేళ్ళూ ఆ ఫాంట్లలోనే విస్తారమైన సాహిత్యం ముద్రించారు.అదంతా ఇప్పుడు యూనీకోడ్ లోకి మార్చాలన్నా ,తిరిగి యూనీకోడ్ లో టైపు చేయించటమన్నా తలకు మించిన భారం.అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు భాష సాంకేతిక విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి  తేవాలంటే మరేం చెయ్యాలి?ఊరికే అడిగితే ఎవరిస్తారు?కాబట్టి ప్రభుత్వమే ప్రజాదరణ పొందిన ఫాంట్లను కొని జాతీయం చెయ్యాలి.ఆయా ఫాంట్లన్నీ యూనీకోడ్ లోకి మళ్ళించేలా ఫాంటు  మారకాల తయారీ కోసం పెట్టుబడి పెట్టాలి.నిపుణులను ఇందుకు నియోగించాలి.
2.పాత పుస్తకాల భాండాగారం
తెలుగు పత్రికల యాజమాన్యాలు వాటి పాత సంచికలనైనా కొన్నాళ్ళగడువు తరువాత ఉచితంగా నెట్ లో విడుదల చేస్తే బాగుంటుంది.అలాగే వివిధ  ఫాంట్ల  లో ఉన్న ఈ పత్రికను యూనీకోడ్ లోకి మార్చి విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది.చదువరులు,పరిశోధకులు సులభంగా వాడుకునేలా పత్రికలన్నీ తెలుగుకు సాంకేతిక హంగులు అద్దాలి
3. ఫాంట్ల మారకం
వెన్న నాగార్జున గారు రూపొందించిన పద్మ ఫాంటు మార్పిడి యంత్రం మన భారతీయ భాషలకు ఎనలేని మేలు చేకూర్చింది.క్రమేణా తెలుగు భాషలో మంచి సాంకేతిక పరికరాలు వచ్చాయి. కొన్ని సమస్యలు తీరాయి. ఇంకా కొన్ని సమస్యలు తీరాలి. తెలుగులో ఇంకా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కావాలి. నాగార్జున వెన్న , కొలిచాల సురేశ్ లాంటివారుd http://eemaata.com/font2unicode/index.php5 లతో తెలుగుకు అద్భుతమైన సేవ చేశారు.వెన్న నాగార్జున గారు (vnagarjuna@gmail.com) యూనికోడేతర ఫాంట్లన్నిటినీ యూనీకోడ్‌కి మార్చేలాగా పద్మ ఫాంటు మారక ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్‌కి మార్చగల సామర్ధ్యానికి ఎదిగింది.http://padma.mozdev.org/. కొన్ని అను ఫాంట్ల సమస్య కొలిచాల సురేశ్‌ (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది. పలానా పలానా సమస్యలను పరిష్కరించండి అంటూ సాంకేతిక నిపుణుల్ని అడిగేవాడిని. 2009లో అను నుండి యూనికోడ్‌ లోకి మార్చే ఒక మారకానికి anurahamthulla version అని నా పేరు కూడా పెట్టారు. అనువాద ఉపకరణాలు, నిఘంటువులు లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌ లోనూ ఆఫ్‌లైన్‌ లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.అనేక రకాల ఫాంట్లను తెలుగు యూనీకోడ్ లోకి మార్చే మంచి సాధనం . http://www.innovatrix.co.in/unicode/fileconverterindex.php5 మీ వ్యాసాలను, పుస్తకాలను యూనీకోడ్ లోకి మార్చుకోండి.
4. యూనీకోడ్‌ లోకి మారుదాం
అందరం యూనీకోడ్‌ లోకి మారుదాం. రకరకాల కీబోర్డులు, ఫాంట్లతో తెలుగు భాషలో కుస్తీపడుతున్నాము. ఈ అవస్థ మనకు తీరాలంటే మనమంతా యూనీకోడ్‌లో మాత్రమే మన పుస్తకాలను ప్రచురించమని కోరాలి. అలా చేస్తే ప్రపంచంలో తెలుగువాళ్ళు ఎక్కడినుండైనా తెలుగు పుస్తకాలను, వ్యాసాలను కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ లలో సులభంగా చదవగలుగుతారు. వ్రాయగలుగుతారు. విషయాలను వెతుక్కో గలుగుతారు.ప్రాచుర్యం పొందిన ఫాంట్లన్నిటినీ యూనీకోడ్‌లోకి మార్చేందుకు, అనువాద సాఫ్ట్‌వేర్‌లు తయారు చేసేందుకు ఖర్చుపెట్టాలి. తమిళనాడు తరహాలో మంచి సాంకేతిక తెలుగు యంత్రాలను కనిపెట్టినవారికి బహుమతులు కూడా ఇవ్వవచ్చు. డి.టి.పీ చేస్తున్న ప్రింటర్లందరూ క్రమేణా యూనీకోడ్‌లోకి మారాలి. యూనీకోడ్ లోకి మారండి అని చాలాకాలం నుండి మనం అందరికీ చెబుతున్నాం.కానీ ఇంకా డి.టి.పి.పని యూనీకోడేతర ఫాంట్లలోనే జరుగుతూ తెలుగు ప్రజలకు మహా ఆటంకంగా ఉంది.కారణం పత్రికల వాళ్ళ ఫాంట్లు అందంగా ఉంతాయి , యూనీకోడ్  ఫాంట్లు అంత అందంగా ఆకర్షణీయంగా ఉండవు అ ని పత్రికలవాళ్ళూ డిటిపి చేసే వాళ్ళూ  అంటున్నారు.
5.తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు
తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.
6. సజీవ వాహిని
సజీవ వాహిని నిర్వాహకులు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్‌సైట్‌ రూపొందించారు. అయితే ఆన్‌లైన్‌ లో మాత్రమే లభిస్తున్న ఈ సౌకర్యాన్ని ఆఫ్‌ లైన్‌లో కూడా అందజేస్తే ఇంటర్‌నెట్‌ లేని వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. తెలుగు భగవద్గీతకు గానీ, తెలుగు కేతలిక్‌ బైబిల్‌కు గానీ, తెలుగు ఖురాన్‌కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.http://sajeevavahini.com/telugubible అందరూ చూడదగినది. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ మిగతా మత గ్రంథాలకు మన తెలుగు పుస్తకాలకు కూడా లభించేలా కృషి చేస్తే విషయాల పరిశీలన సులభం అవుతుంది. తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంథాలకు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎంతో అవసరం. తెలుగు గ్రంథాలు యూనీకోడ్‌లో ఉంటేనే ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్‌ ఆయా విషయాలను వెతుక్కోటానికి పనికొస్తుంది. కాలంతో పాటు మనం కూడా మారాలి. తెలుగులో తయారైన పి.డి.యఫ్‌. ఫైలును కూడా నేరుగా యూనీకోడ్‌లోకి మార్చగలిగే స్థాయి రావాలి. తెలుగు సాంకేతిక నిపుణుల  కృషి  నిరంతరంసజీవ వాహిని లాగా  సాగుతూనే ఉండాలి.   
( http://www.andhrabhoomi.net/content/unicode  
ఆంధ్ర భూమి   28.7.2012,నడుస్తున్న  చరిత్ర  ఆగస్టు 2012 )

18, జులై 2012, బుధవారం

క్రీ.శ.1900 సంవత్సరానికి పూర్వపు తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులు


       30.క్రీ.శ.1900 సంవత్సరానికి పూర్వపు  తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులు
సంవత్సరం     నిఘంటు నిర్మాత       నిఘంటువు పేరు, ప్రచురించ బడిన ప్రదేశం
1818       డబ్ల్యు. బ్రౌన్‌      A Vocabulary of Gentoo andEnglish   మద్రాస్‌.
1821       ఎ.డి. కేంప్‌బెల్‌    A Dictionary of the Teloogoo Language  మద్రాస్‌.
1835       జె.సి.మోరిస్‌      A Dictionary, English and Teloogoo      మద్రాస్‌.
1839       డబ్ల్యు. కార్పెంటర్‌ A Dictionary of English synonyms      లండన్‌.
1841       సి. రామకృష్ణ శాస్త్రులు     A Vocabulary, in English and Teloogoo     మద్రాస్‌.
1841       జె. నికోలాస్‌       A Vocabulary of English and Teloogoo       మద్రాస్‌.
1844       ఇ. బాల్ఫోర్‌       Vocabularies Telagoo            కలకత్తా.
1847       డబ్ల్యు. ఇల్లియట్‌  Language of the Goands with terms in Telugu      కలకత్తా.
1849       బి.హెచ్‌. హాడ్జ్‌సన్‌ Vocabularies of Southern India      కలకత్తా.
1852       చార్లెస్‌ఫిలిప్‌ బ్రౌన్‌ A DICTIONARY, Telugu and Eng1ish   మద్రాస్‌.
1854       చార్లెస్‌ఫిలిప్‌ బ్రౌన్‌ A Dictionary of the Mixed Dialects      మద్రాస్‌.   
1862       రెవరండ్‌ పెర్సివల్‌ Telugu - Eng1ish DICTIONARY      మద్రాస్‌.
1868       సర్‌.ఏ.జె. ల్యాల్‌   A Vocabulary in Hindustani, English,Telugu    నాగపూర్‌.
1886       రెవరండ్‌ పెర్సివల్‌ Anglo-Telugu Dictionary     మద్రాస్‌.
1889       వీరస్వామి మొదలియార్‌  Vocabulary in English and Telugu   మద్రాస్‌.
1891       పి. శంకర నారాయణ       English - Telugu Dictionary      మద్రాస్‌.
1895       చార్లెస్‌ఫిలిప్‌ బ్రౌన్‌ A DICTIONARY, Eng1ish and Telugu    మద్రాస్‌.
1898       జి.డబ్ల్యు. టేలర్‌   An English-Telugu Vocabulary       మద్రాస్‌.
1900       పి. శంకర నారాయణ       Telugu - English Dictionary   మద్రాస్‌.
1900       పి. హోలర్‌       Telugu Nighantuvulu        రాజమండ్రి.

వాపు కాదు బలుపే



29.వాపు  కాదు  బలుపే
                కాలగమనంలో ప్రతి భాషా మారుతూనే ఉంది. ఇతర భాషల నుంచి మాటలను తనలో విలీనం చేసుకుంటూ అభివృద్ధి చెందుతోంది. కొత్తదనాన్ని సంతరించుకుంటోది. ఇతర భాషల నుంచి అవసరాన్ని బట్టి మాటలను చేర్చుకోటం ప్రతి భాషకు అవసరం. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు. అయితే కొందరు సంప్రదాయ వాదులు ఇటువంటి మార్పును సహించలేరు. భాష అభివృద్ధి చెందుతుందని కాక భ్రష్టుపట్టిపోతుందని వారు బాధపడుతుంటారు. కాని అటువంటి బాధ అర్థం లేనిది. రోజురోజుకూ ప్రపంచం కొత్తదనంతో పల్లవిస్తూ ఉంటుంది. కొత్త అభిప్రాయాలు కలుగుతుంటాయి. కొత్త సంఘటనలు సంభవిస్తాయి. నూతన వస్తువులు పుట్టు కొస్తుంటాయి. వీటన్నిటి కోసం కొత్త మాటలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఇతర భాషలలోని పదాలను స్వీకరించాల్సి ఉంటుంది. ఇటువంటివన్నీ సహజ పరిణామాలే. అవసరం ఉన్నా లేకపోయినా ఇతర భాషలకే ప్రాధాన్యం ఇస్తూ పరభాషా మోజును పెంచుకుంటూ మాతృభాషను చులకనగా చూడటం మాత్రం తగని పని. ఇతర భాషలు సొంత భాషపై పెత్తనం చేసే పరిస్థితినీ కల్పించకూడదు.
                ఏ భాష అయినా ఒక నది వంటిది. నదులు తమ ప్రవాహ వేగంలో ఇతర ఉపనదులను కలుపుకొని మహానదులుగా మారి కదిలిపోయినట్లుగా భాషలు కూడా ఇతర భాషల్లోని పదాల నెన్నిటినో తమలో విలీనం చేసుకొని విస్తరిస్తుంటాయి. సంస్కృత, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు, పారశీక భాషలలోని  ఎన్నో పదాలు తెలుగులో కలిసిపోయి తెలుగు మాటలుగానే చెలామణీ అవుతున్నాయి.   
                ఇతర భాషా పదాలను తనలో కలుపుకోటంలో ఇంగ్లీషు మరీ ముందంజలో ఉందని చెప్పాలి. మొదటినుంచీ ఇంగ్లీషు అనేక భాషల సమ్మేళనంగానే వర్థిల్లుతూ వచ్చింది. ఇటీవల ఆ ధోరణి మరీ ఎక్కువైంది.
                ఈ విధంగా అన్యభాషా పదాలను ఇంగ్లీషులోకి చేర్చుకోవటం వల్ల ఆ భాష తన స్వచ్ఛతను కోల్పోతుందనీ ఆ విధంగా సాధించే అభివృద్ధి వాపే కాని బలుపు కాదని సంప్రదాయవాదులు ఆ వాదనతో ఏకీభవించటంలేదు. దేశాల మధ్య దూరాలు తగ్గిపోతూ ప్రపంచమంతా ఏకమవుతున్న ఈ తరుణంలో ఇతర భాషలలోని పదాలను తనలో ఐక్యం చేసుకుంటూ ఇంగ్లీషు గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని ఇది బలుపే కాని వాపు కాదని వారంటున్నారు!
                                                                              (ఈనాడు సంపాదకీయం 25 జూలై 2004)

''దేశభక్తి అంటే మాతృభాష విూద అభిమానమే. మాట్లాడుతున్న భాషను కాదని మృతభాషను పూజించటం ఎలాంటిదంటే, ఆకలితో మాడిచస్తున్న సాటిమనిషికి అన్నంపెట్టకుండా, చనిపోయిన వారి పేరుతో శ్రాద్ధభోజనం పెట్టడం లాంటిది''.          - గిడుగు వేంకటరామమూర్తి.

తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన వ్య క్తులు


27.తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన వ్య క్తులు

అధికారభాషా సంఘం అధ్యక్షులు                    పనిచేసిన కాలం
                                   నుండి                            వరకు    
 1.           వావిలాల గోపాలకృష్ణయ్య    19-3-74            14-2-77
 2.           టి. అనుసూయమ్మ                ----     1-8-78
 3.           వందేమాతరం రామచంద్రరావు          2-8-78             31-8-81
 4.           సి. నారాయణరెడ్డి     4-9-81             13-8-85
 5.           కొత్తపల్లి వీరభద్రరావు          2-12-85            31-12-86
 6.           నండూరి రామకృష్ణమాచార్య           1-11-87            31-1-90
 7.           పి. యశోదరెడ్డి         5-2-90           28-2-93
 8.           అబ్బూరి వరద రాజేశ్వరరావు           17-3-93          3-5-93
 9.           గజ్జెల మల్లారెడ్డి      17-5-93            21-6-95
 10.         తూమాటి దొణప్ప             21-6-95            4-9-95
 11.         మాడుగుల నాగఫణిశర్మ      27-5-95            27-5-2002
 12.         పరుచూరి గోపాలకృష్ణ             19-2-2003                             19-3-2005
 13.         ఎ.బి.కె. ప్రసాద్‌    20-3-2005              ఈరోజు వరకు
తెలుగు విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్లు
 1.           తూమాటి దొణప్ప          08-01-1986       20-06-1989
 2.           సి. నారాయణరెడ్డి                 21-06-1989        04-11-1992
3.            పేర్వారం జగన్నాధం       05-11-1992       04-11-1995
 4.           నాయని కృష్ణకుమారి      05-01-1996       24-03-1999
 5.           యన్‌. గోపి        25-03-1999       23-03-2002
 6.           జి.వి. సుబ్రహ్మణ్యం               27-05-2002        30-05-2005
 7.           ఆవుల మంజులత          6-08-2005
తెలుగు అకాడమి డైరెక్టర్లు
1.            డా|| పి.ఎస్‌.ఆర్‌ అప్పారావు       29-6-68 1-7-74
2.            కె. వీరభద్రరావు  2-7-74   4-8-75
3.            యన్‌. వెంకటస్వామి       5-8-75   16-11-80
4.            జి. మనోహరరావు          17-11-80               9-5-82
5.            జి. గోపాలకృష్ణన్‌  10-5-82 5-9-83
6.            టి. వెంకారెడ్డి      6-9-83   10-8-85
7.            వి. కొండలరావు   11-8-85 10-8-90
8.            డా|| కె. భక్తవత్సలరావు   11-8-90 1-1-91
9.            సి.ఎన్‌.వి. సుబ్బారెడ్డి       1-1-91   31-7-92
10.  కె. హేమలత 1-8-92   30-11-92
11.          అ. హైమవతి     1-12-92 16-3-93
12.          చ. నర్సిరెడ్డి       17-3-93 6-3-94
13.          దీవి సుబ్బారావు 7-3-94   31-7-98
14.          డా|| విజయభారతి        1-8-98   30-11-99
15.          ఆవుల మంజులత          1-12-99 5-10-2005
   16. జె. ప్రతాప రెడ్డి                 6-10-2005                ఈరోజువరకు

ఆంధ్ర విశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1.            పింగళి లక్ష్మీకాంతం        1931 - 49
2.            గంటి సోమయాజి 1949 - 63
3.            కె.వి.ఆర్‌ నరసింహం        1963 - 74
4.            తూమాటి దొణప్ప          1974 -76
5.            యస్‌.వి. జోగారావు        1976 -79
6.            కొర్లపాటి శ్రీ రామమూర్తి    1979 - 82
7.            చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి 1982 - 85
8.            లకంసాని చక్రధరరావు     1985 - 88
9.            కోలవెన్ను మలయవాసిని 1988 - 91
10.          వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి    1991 - 93
11.          పల్లికొండ ఆపదరావు       1993 - 96
12.          మర్రిబోయిన జయదేవ్‌     1996 - 99
13.          బాల అరుణకుమారి        1999 - 2001
14.          పర్వతనేని సుబ్బారావు    2001 - 2005
15.          ఇ. విశ్వనాధరెడ్డి  2005 -
ఉస్మానియావిశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1.            రాయప్రోలు సుబ్బారావు   1919 - 1946
2.            ఖండవల్లి లక్ష్మీరంజనం     1946 – 1964
3.            దివాకర్ల వేంకటావధాని     1964 - 1973
4.            బి. రామరాజు     1973 - 1983
5.            గోపాల కృష్ణారావు          1983 - 1984
6.            నాయిని కృష్ణకుమారి      1984 - 1986
7.            ఎం. కుల శేఖరరావు       1986 - 1988
8.            ఎ. రాజేశ్వర వర్మ 1988 - 1989
9.            వేటూరి ఆనందమూర్తి      1989 - 1990
10.          ఎస్‌.వి.రామారావు         1990 - 1992
11.          సీతా కళ్యాణి      1992 - 1994
12.          ఎన్‌. గోపి          1994 - 1996
13.          ఎల్లూరి శివారెడ్డి   1996 - 1998
14.          రఘమన్న        1998 - 2000
15.          ఎల్లూరి శివారెడ్డి   2000 - 2001
16.          కసిరెడ్డి వెంకటరెడ్డి 2002 -
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతులు
1.            రాయప్రోలు సుబ్బారావు   1956-1959
2.            భూపతి లక్ష్మన్నారాయణ  1959-1961
3.            పింగళి లక్ష్మీకాంతం        1961-1965
4.            జి.యన్‌. రెడ్డి      1965-1981
5.            జె. సూర్యనారాయణ       1981-1982
6.            యం. సుబ్బారెడ్డి 1982-1984
7.            జి. నాగయ్య      1984-1986
8.            కె. సర్వోత్తమరావు         1986-1988
9.            పి.సి. నరసింహా రెడ్డి        1988-1990
10.          ఎస్‌.జి.డి. చంద్రశేఖర్‌       1990-1991
11.          పి. నరసింహ రెడ్డి 1991-1993
12.          కె. సర్వోత్తమ రావు        1993-1996
13.          పి. నరసింహ రెడ్డి 1996-1999
14.          యస్‌.జి.డి. చంధ్రశేఖర్‌     1999-2002
15.          జి. చలపతి        2002-2004
16.          జె. ప్రతాప్‌ రెడ్డి    2004-2005
17.          డి.వి. చంద్రశేఖరరెడ్డి        2005-
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం   తెలుగు విభాగాధిపతులు
                పేరు     పనిచేసిన కాలం
1.            కోరాడ మహదేవశాస్త్రి      1981
2.            మద్దూరి సుబ్బారెడ్డి        1982
3.            తుమ్మపూడి కోటేశ్వరరావు          1983
4.            కోరాడ మహదేవశాస్త్రి      1984
5.            కొలకలూరి ఇనాక్‌ 1985 - 86
6.            శలాక రఘనాధ శర్మ       1987 - 88
7.            హెచ్‌.యస్‌. బ్రహ్మానందం   1989 - 90
8.            పి.యల్‌. శ్రీనివాస రెడ్డి      1991 - 92
9.            ఆర్‌. చంద్రశేఖర రెడ్డి        1993 - 96
10.          కొలకలూరి ఇనాక్‌ 1996 - 99
11.          శలాక రఘనాధ శర్మ       1999 - 2001
12.          యం.కె. దేవకి     2001        - 2005
13.          నరసింహులు     2005 -
నాగార్జునవిశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1.            తూమాటి దొణప్ప          1976-1985
2.            బి. పురుషోత్తం   1986-1987
3.            టి. నిర్మల         1988-1989
4.            ఎస్‌. గంగప్ప      1990-1991
5.            ఎ. పున్నారావు   1992-1993
6.            వై. బాలగంగధరరావు       1994-1995
7.            జి. కృపాచారి      1996-1998
8.            ఎన్‌. అనంతరామశాస్త్రి     1999-2000
9.            టి. సత్యవతి       2001-2002
10.          పి. వరప్రసాదమూర్తి        2002-2004
11.          జి.వై. ప్రభావతి    2004-
కాకతీయ విశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1.            కె.వి. రామకోటిశాస్త్రి         1973-1979
2.            ఎ. రాజేశ్వర శర్మ 1979-1981
3.            కె.వి. రామకోటి శాస్త్రి        1981-1987
4.            పి. జగన్నాధం    1987-1990
5.            కె. సుప్రసన్నాచార్య         1990-1993
6.            హెచ్‌. శివకుమార్‌          1993-1995
7.            ఎ. భూమయ్య    1995-1997
8.            కె. కాత్యాయని    1997-1999
9.            పి. జ్యోతి 1999-2001
10.          బి. ఐలయ్య       2001-2003
11.          కె. యాదగిరి      2003-
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1.            పి. కుసుమకుమారి        1989-2001
2.            ఎమ్‌. విజయలక్ష్మి         2001-2004
3.            డి. కృష్ణ కుమారి  2004-